Deputy Chief Ministers: డిప్యూటీ సీఎంల నియామకం రాజ్యాంగ వ్యతిరేకం కాదు: సుప్రీంకోర్టు
Deputy Chief Ministers: డిప్యూటీ సీఎంల నియామకం రాజ్యాంగ వ్యతిరేకం కాదు అని సుప్రీంకోర్టు తెలిపింది. ఇప్పటికి పలు రాష్ట్రాలు డిప్యూటీ సీఎంలను నియమిస్తున్న విషయం తెలిసిందే. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జేబీ పర్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఇవాళ ఈ తీర్పును ఇచ్చింది.
న్యూఢిల్లీ: ఉప ముఖ్యమంత్రుల(Deputy Chief Ministers) నియామకంపై సుప్రీంకోర్టు ఇవాళ కీలక వ్యాఖ్యలు చేసింది. డిప్యూటీ సీఎంల నియామకం రాజ్యాంగ వ్యతిరేకం కాదు అని కోర్టు తెలిపింది. ఇప్పటికి పలు రాష్ట్రాలు డిప్యూటీ సీఎంలను నియమిస్తున్న విషయం తెలిసిందే. పార్టీల్లో ఉన్న సీనియన్ నేతలకు ప్రాధాన్యత ఇస్తూ, కొన్ని సందర్భాల్లో కూటమి ప్రభుత్వాల ఏర్పాటు కోసం డిప్యూటీ సీఎం పదవులను ఏర్పాటు చేస్తున్నారు.
చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జేబీ పర్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఇవాళ ఈ తీర్పును ఇచ్చింది. రాజ్యాంగ విలువ ప్రకారం డిప్యూటీ సీఎంల నియామకం జరుగుతుందని ధర్మాసనం తెలిపింది. ముఖ్యమంత్రి పరిధిలో ఉండే మంత్రిమండలిలో డిప్యూటీ సీఎంలు భాగమని కోర్టు పేర్కొన్నది.
డిప్యూటీ సీఎంల నియామకాన్ని తప్పుపడుతూ దాఖలైన పిల్‌ను ఇవాళ సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. డిప్యూటీ పోస్టుల గురించి రాజ్యాంగంలో ఎక్కడా లేదని పిటీషనర్లు వాదించారు. అయితే డిప్యూటీ సీఎంల నియామకం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు రాదు అని సుప్రీంకోర్టు తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delimitation | అసెంబ్లీ సీట్ల గరిష్ఠ పరిమితి 650కి పెంపు.. లోక్‌సభలో 80 నుంచి 120కి స్థానాల పెంపు
Delimitation | పట్టణాలదే పెత్తనం.. నియోజకవర్గాల పునర్విభజనతో భారీ మార్పులు!
Kadiyam Srihari | కడియం వీడియోను కూడా చూపాలి.. ఎథిక్స్ కమిటీ మీటింగ్‌లో బీఆర్ఎస్ సభ్యుల పట్టు
Deeksha Divas | దీక్ష రోజున కేసీఆర్ షాడో నేనే.. నాటి అనుభవాలు పంచుకున్న ఏసీపీ శ్రీధర్!
Delimitation | మోదీ సర్కార్‌లో కొత్త ఆశలు.. డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే, ఎన్సీపీ(ఎస్పీ) మద్దతు!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

