తిరువనంతపురం : ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు నిరసనగా ఉక్రెయిన్‌కు సంఘీభావం తెలుపుతూ రష్యన్ సలాడ్‌ను మెనూ నుంచి తొలగించాలని ఓ కేరళ కేఫ్ నిర్ణయించింది. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై మాస్కో దండయాతక్రకు నిరసనగా పలు దేశాలు ఇప్పటికే రష్యాపై ఆంక్షలు విధించాయి.
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి తెగబడటాన్ని నిరసిస్తూ కొచ్చిలోని కశి ఆర్ట్ కేఫ్ అండ్ గ్యాలరీ తన మెనూ నుంచి రష్యన్ సలాడ్‌ను తొలగించింది. పోర్ట్ కొచ్చిలోని రెస్టారెంట్ బయట తమ మెనూ నుంచి రష్యన్ సలాడ్‌ను తొలగించామనే మెసేజ్‌ను కేఫ్ పోస్ట్ చేసింది. మెసేజ్ బోర్డ్ ఫోటోగ్రాఫ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఆన్లైన్లో చర్చకు దారితీసింది.
యుద్ధాన్ని ఖండిస్తూ తాము ఈ తరహాలో నిరసన ప్రదర్శించామని కేఫ్ యజమాని ఎద్గర్ పింటో పేర్కొన్నారు. కళా ప్రేమికులుగా తాము భావప్రకటనా స్వేచ్ఛను విశ్వసిస్తామని తాము ఈ రకంగా ఉక్రెయిన్ ప్రజలకు మద్దతు తెలుపుతున్నామని చెప్పుకొచ్చారు. కేరళ కేఫ్ నిర్ణయాన్ని పలువురు నెటిజన్లు స్వాగతించగా మెనూ నుంచి రష్యన్ సలాడ్ తొలగించడాన్ని మరికొందరు తప్పుపట్టారు.