ఊరట దక్కినా ఇంకా జైల్లోనే!
ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
- ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్
- సీబీఐ కేసులో 25 వరకు కస్టడీ పొడిగింపు
న్యూఢిల్లీ, జూలై 12: ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే అవినీతి ఆరోపణల కేసులో కస్టడీ పొడిగింపు వల్ల ఇంకా ఆయన జైల్లోనే ఉండాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో సీఎంగా కొనసాగాలా, వద్దా అనే విషయాన్ని కేజ్రీవాల్‌కే వదిలిపెడుతున్నామని కోర్టు తెలిపింది.
మూడు నెలలకు పైగా ఆయన జైలు జీవితంతో ఇబ్బందులు పడుతున్న విషయం తమకు తెలుసని చెప్పింది. ఆయన అరెస్ట్ చట్టబద్ధతపై తలెత్తిన ప్రశ్నల విచారణను విస్తృత ధర్మాసనానికి సిఫారసు చేస్తున్నామంది. కాగా, అవినీతి ఆరోపణల కేసులో ఢిల్లీ కోర్టు ఈ నెల 25 వరకు కేజ్రీవాల్ కస్టడీని పొడిగించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

