బెంగళూరు : మనుషులు తినేందుకు తమ ప్లాట్‌ఫారమ్స్‌లో విషపూరిత ఉమ్మెత్త కాయలు, గింజలు అమ్ముతున్న అమెజాన్, ఇన్‌స్టామార్ట్, బిగ్ బాస్కెట్ యాప్‌ల ఫుడ్ లెసెన్సులను కర్ణాటక ఆహార భద్రత, ఔషధ నియంత్రణ విభాగం తాత్కాలికంగా రద్దు చేసింది. వీటి అమ్మకాలపై ఫిర్యాదులు రావడంతో ఈ మేరకు చర్యలు తీసుకొంది.
కొన్ని యాప్‌లు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ సంఖ్యను సైతం ఉమ్మెత్త కాయల ప్యాకెట్లపై ముద్రించడాన్ని అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై అమెజాన్ వివరణ ఇవ్వలేదు. ఇన్‌స్టామార్ట్ అదనపు సమయం కోరగా, ఉమ్మెత్త కాయల అమ్మకాన్ని ఆపేసినట్టు బిగ్ బాస్కెట్ తెలిపింది. భవిష్యత్తులో ‘మనుషులు తినడానికి కాదు’ అని స్పష్టంగా పేర్కొన్న లేబుల్‌ను ప్యాకెట్లపై ముద్రిస్తామని పేర్కొంది