బెంగళూరు: ట్విట్టర్ అకౌంట్లను బ్లాక్ చేసి, ట్వీట్లను తొలగించిన కేంద్ర ప్రభుత్వ తీరును సవాల్ చేస్తూ ట్విట్టర్ దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. ట్విట్టర్ కంపెనీకి ఈ మేరకు అభ్యర్థించేందుకు అర్హత లేదని వ్యాఖ్యానించింది. కేంద్రం గతంలో కొన్ని ట్విట్టర్ అకౌంట్లను బ్లాక్ చేయగా, దీనిపై ఆ కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్ విచారణ జరిపారు. కర్ణాటక లీగల్ సర్వీసెస్ అథారిటీకి 45 రోజుల్లోగా రూ.50 లక్షల జరిమానా చెల్లించాలని కంపెనీని ఆదేశించింది.