Supreme Court | కేంద్రం ఎన్డీఆర్ఎఫ్ నిధులు విడుదల చేయడం లేదని.. ‘సుప్రీం’కు సీఎం..!
Supreme Court | కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నీటి కొరతతో అల్లాడుతున్న రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావడంలేదని పేర్కొన్నారు. కేంద్రం నుంచి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (NDRF) విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
Supreme Court | కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నీటి కొరతతో అల్లాడుతున్న రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావడంలేదని పేర్కొన్నారు. కేంద్రం నుంచి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (NDRF) విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ‘రాష్ట్రానికి కరువు సహాయ నిధుల పంపిణీలో జాప్యంపై కేంద్ర ప్రభుత్వంపై ఈ పిటిషన్ దాఖలు చేశాం’ అని సిద్ధరామయ్య తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై మంత్రివర్గ బృందం నివేదిక సమర్పించి ఐదు నెలలు గడుస్తున్నా కేంద్రం నిధులు విడుదల చేయలేదని ఆరోపించారు.
రాష్ట్రం తీవ్ర కరువుతో అల్లాడుతోందని.. దీంతో జనజీవనం అతలాకుతలమవుతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 236 తాలూకాల్లో 223 తాలూకాలు కరువుగా ప్రకటించారని.. వీరిలో 196 ప్రాంతాలు తీవ్ర కరువు ప్రాంతంగా ప్రకటించినట్లు చెప్పారు. గత 30-40 ఏళ్లలో అత్యంత తీవ్రమైన పరిస్థితి ఉందని.. 48లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లుగా చెప్పారు. నిధులు విడుదల చేయాలని కేంద్రానికి మూడుసార్లు వినతిపత్రాలు ఇచ్చినా ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా రాలేదన్నారు. పిటిషన్లో ఖరీఫ్ 2023 సీజన్లో వ్యవసాయ, ఉద్యానవన పంటలకు కలిపి రూ.35,162 కోట్ల మేర నష్టం జరిగినట్లు పేర్కొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ కింద కేంద్రం నుంచి రూ.18,171.44కోట్లు సహాయం చేయాలని కోరినట్లు తెలిపారు.
నివేదిక వచ్చినా కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పిటిషన్లో పేర్కొన్నారు. విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం కేంద్రం నుంచి సహాయం పొందే అర్హత రాష్ట్రానికి ఉందని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం.. ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ (IMCT) నివేదిక అందిన నెలలోగా ఎన్డీఆర్ఎఫ్ నుంచి రాష్ట్రానికి సహాయం అందించే విషయంలో కేంద్రం తుది నిర్ణయం తీసుకోవాలని పిటిషన్ పేర్కొంది. గతేడాది అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వ బృందం రాష్ట్రానికి వచ్చి పరిశీలించిందని సిద్ధరామయ్య తెలిపారు. కరువుపై కేంద్రానికి మంత్రులతో కలిసి ఢిల్లీకి వెళ్లామని.. కానీ కేంద్రమంత్రులు ఎవరూ కలువలేదన్నారు. ఆ తర్వాత మళ్లీ కేంద్ర హోంశాఖ మంత్రిని కలిసినా ఇంకా నిధులు విడుదల చేయలేదని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | వచ్చే ఏడాది దీపావళికి ‘స్పిరిట్’
Dasara Property Sales | దసరా సందడి నిల్.. అమ్మకాలు, లాంచింగ్ లేక వ్యాపారం దివాళా
Crazy Kalyanam | రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

