బెంగళూరు : కర్ణాటకలో మహిళా ప్రభుత్వ ఉన్నతాధికారి దారుణ హత్యకు గురయ్యారు. గనులు, భూగర్భ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ప్రతిమ(45)ను బెంగళూరు సుబ్రహ్మణ్యపురలోని ఆమె నివాసంలో గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి చంపారని పోలీసులు తెలిపారు. శనివారం రాత్రి ఈ ఘటన జరిగిందని, ఆ సమయంలో ఇంటివద్ద ఆమె ఒక్కరే ఉన్నారని తెలిసింది. ప్రతిమ సోదరుడు ఆదివారం తెల్లవారుజామున ఇంటికి వచ్చి చూడగా.. ఆమె విగతజీవిగా పడి ఉండటం చూసి షాక్‌కు గురయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. హత్యకు గల కారణం తెలియరాలేదని, విచారణ నిమిత్తం మూడు బృందాల్ని ఏర్పాటుచేశామని బెంగళూరు సిటీ సౌత్ డివిజన్ డీసీపీ రాహుల్‌కుమార్ చెప్పారు.