Karnataka | రూ.2 లక్షలు ఇవ్వనందుకు.. ముస్లిం వ్యక్తిని కొట్టి చంపిన గో రక్షకులు
Karnataka | పశువుల సంత నుంచి కొన్న వాటిని తరలించేందుకు అనుమతి ఉన్న పత్రాలను ఇద్రిస్ పాషా వారికి చూపించాడు. అయినప్పటికీ పునీత్, అతడి అనుచరులు రూ.2 లక్షలు డిమాండ్ చేశారు. డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించిన ఇద్రిస్ పాషాను గో రక్షకులు దారుణంగా కొట్టి చంపారు.
బెంగళూరు: డిమాండ్ చేసిన రూ.2 లక్షలు ఇవ్వనందుకు ఒక ముస్లిం వ్యక్తిని గో సంరక్షకులు కొట్టి చంపారు. బీజేపీ పాలిత కర్ణాటక (Karnataka)లో ఈ దారుణం జరిగింది. పశువుల వ్యాపారి ఇద్రిస్ పాషా, శనివారం ఒక వాహనంలో పశువులను తరలిస్తున్నాడు. పునీత్ కెరెహళ్లి నేతృత్వంలోని ఆవు సంరక్షకులు ఆ ముస్లిం వ్యక్తిని అడ్డుకున్నారు. అయితే పశువుల సంత నుంచి కొన్న వాటిని తరలించేందుకు అనుమతి ఉన్న పత్రాలను ఇద్రిస్ పాషా వారికి చూపించాడు. అయినప్పటికీ పునీత్, అతడి అనుచరులు రూ.2 లక్షలు డిమాండ్ చేశారు. డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించిన ఇద్రిస్ పాషాను గో రక్షకులు దారుణంగా కొట్టి చంపారు.
కాగా, రామనగర జిల్లాలోని సాత్నూర్ గ్రామం వద్ద రోడ్డు పక్కన పడి ఉన్న ఇద్రిస్ పాషా మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. దీని గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ సంఘటనపై దర్యాప్తు జరిపారు. గో సంరక్షకులు పునీత్, అతడి అనుచరులపై హత్యతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు వెతుకుతున్నారు.
మరోవైపు కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ నియోజవర్గంలో ఈ సంఘటన జరిగింది. దీంతో ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. మైనార్టీల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read:
Gunned Down | పలు కేసులున్న బీజేపీ నేత.. దుండగుల కాల్పుల్లో మృతి
Bus Falls Into Ditch | లోయలో పడిన బస్సు.. ఇద్దరు మృతి, పలువురికి గాయాలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

