Ranya Rao: 17 బంగారు బిస్కెట్లు తీసుకొచ్చా.. వాంగ్మూలంలో రాన్యా రావు
Ranya Rao: విదేశాల నుంచి 17 బంగారు కడ్డీలు తీసుకువచ్చినట్లు కన్నడ నటి రాన్యా రావు అంగీకరించింది. తన వాంగ్మూలంలో ఈ విషయాన్ని ఆమె చెప్పింది. మిడిల్ ఈస్ట్, దుబాయ్‌తో పాటు కొన్ని పాశ్చాత్య దేశాలకు టూరు వెళ్లినట్లు ఆమె పేర్కొన్నది.
బెంగుళూరు: కన్నడి నటి రాన్యా రావు(Ranya Rao)ను ఇటీవల బెంగుళూరు పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 17 బంగారు బిస్కెట్లతో ఆమె బెంగుళూరు విమానాశ్రయంలో పట్టుబడ్డారు. అరెస్టు చేసిన ఆమెను పోలీసులు విచారించారు. తన వాంగ్మూలంలో కొన్ని విషయాలను ఆ నటి వెల్లడించింది. విదేశాల నుంచి 17 బంగారు బిస్కెట్లు తీసుకువచ్చినట్లు ఆమె అంగీకరించింది. రెవన్యూ అధికారులకు ఆ వాంగ్మూలంలో ఈ విషయాన్ని ఆమె స్పష్టం చేసినట్లు ఎఫ్ఐఆర్ ద్వారా తెలిసింది. గత ఏడాది కాలంలో తాను వెళ్లిన విదేశీ టూర్ల గురించి కూడా ఆమె చెప్పింది. మిడిల్ ఈస్ట్, దుబాయ్‌తో పాటు కొన్ని పాశ్చాత్య దేశాలకు వెళ్లినట్లు ఆమె పేర్కొన్నది.
యూరోప్ వెళ్లాను, అమెరికా, మిడిల్ ఈస్ట్ వెళ్లానని తన వాంగ్మూలంలో రాన్యా రావు తెలిపింది. దుబాయ్, సౌదీ అరేబియా కూడా వెళ్లినట్లు పేర్కొన్నది. ప్రస్తుతం చాలా అలసిపోయానని, ఇంతకన్న ఎక్కువ విషయాలు ఏమీ చెప్పలేనని ఆమె పేర్కొన్నది. గత ఏడాది కాలంలో ఆమె దుబాయ్‌కు 27 సార్లు వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. తన వాంగ్మూలంలో కుటుంబ సభ్యుల వివరాలను ఆ నటి చెప్పింది. తన తండ్రి పేరు కేఎస్ హెగ్డేశ్ అని, ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి అని, తన భర్త పేరు జతిన్ హుక్కేరి అని, ఆయన ఓ ఆర్కిటెక్ట్ అని ఆమె పేర్కొన్నది. తన తల్లికి చెందిన రెండో భర్త కర్నాటక పోలీసు హౌజింగ్ శాఖ డీజీపీ రాంచంద్రరావు అని ఆమె తన వాంగ్మూలంలో చెప్పింది.
ప్రస్తుతం రాన్యా రావు జుడిషియల్ కస్టడీలో ఉన్నది. న్యాయంపై నమ్మకం ఉన్నట్లు తెలిపింది. ఎవరి వత్తిడిలేకుండా, స్వచ్ఛందంగా వాంగ్మూలం ఇచ్చినట్లు పేర్కొన్నది. సోమవారం రాత్రి కెంపగౌడ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారు రాన్యా రావును పట్టుకున్నారు. సుమారు 15 కోట్ల విలువైన 14 కిలోల బంగారు కడ్డీలు ఆమె తీసుకెళ్తూ దొరికింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

