స్థానిక ఎన్నికల్లో కమల్ హాసన్ పార్టీ ఒంటరి పోరు

చెన్నై: తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో నటుడు కమల్ హాసన్ పార్టీ ఒంటరి పోరాటం చేయనున్నది. 9 జిల్లాల్లో జరుగనున్న స్థానిక ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయాలని మక్కల్ నీది మయం (MNM) నిర్ణయించింది. ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో మక్కల్ నీది మయం (MNM) ఒంటరిగా పోటీ చేస్తుంది. మొత్తం తొమ్మిది జిల్లాల్లో నేను ప్రచారం చేస్తాను. మైదానంలో కలుద్దాం. విజయం మనదే’ అని కమల్ హాసన్ గురువారం ట్వీట్ చేశారు. అక్టోబర్ 6 నుంచి 9 వరకు 9 జిల్లాల్లో జరుగనున్న స్థానిక ఎన్నికల్లో 1,521 మంది అభ్యర్థులను బరిలోకి దించాలని ఆ పార్టీ నిర్ణయించింది. మంచి అభ్యర్థుల ఎంపిక కోసం ప్రతి జిల్లాలో జోనల్ కార్యదర్శిని ఇంచార్జీగా నియమించింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన కమల్ హాసన్ పార్టీ ఈ సారి భారీ విజయంతో ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తున్నది. ఈ ఏడాది జరిగిన ఆ రాష్ట్ర ఎన్నికల్లో ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి (AISMK), భారతీయ జననాయక కట్చి (IJK) పార్టీలతో ఎంఎన్ఎం పొత్తుపెట్టుకున్నది.
కాగా, 2018లో పార్టీ ఏర్పాటు తర్వాత తొలిసారిగా జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు లేకుండా స్వతంత్రంగా పోటీ చేసి తన సత్తాను చాటాలని కమల్ హాసన్ ఉవ్విళ్లూరుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పలువురు సీనియర్ నేతలు ఆ పార్టీని వీడారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించి పార్టీని బలోపేతం చేయాలని ఆయన భావిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NASA Astronauts: భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో .. ఓటేసిన నాసా ఆస్ట్రోనాట్లు.. వీడియో
ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
Allu Aravind | హీరోగా అల్లు అరవింద్,హీరోయిన్గా జయసుధ.. సినిమా టైటిల్ కూడా చెప్పేశారు!
ఎడతెరిపి లేని వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. భద్రాద్రి జిల్లాలో జలమయమైన రహదారులు
Vijay | తమిళ సినీ పరిశ్రమకు విజయ్ సర్కార్ గుడ్న్యూస్.. రోజుకు ఆరు షోలకు అనుమతి,కాని దానికి మాత్రం నో!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

