న్యూఢిల్లీ: ప్రధాని మోదీని ఇవాళ ఫిల్మ్ స్టార్, ఎంఎన్ఎం పార్టీ చీఫ్, ఎంపీ కమల్ హాసన్(Kamal Haasan) కలిశారు. ఈ విషయాన్ని కమల్ తన ఎక్స్ అకౌంట్లో వెల్లడించారు. ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఫీలవుతున్నట్లు చెప్పారు. తమిళ ప్రజల ప్రతినిధిగా, ఓ కళాకారుడిగా .. ప్రధాని ముందుకు కొన్ని అభ్యర్థనలు తీసుకెళ్లినట్లు కమల్ తెలిపారు. కీలడి కళాకృతులకు గుర్తింపు వచ్చే విధంగా త్వరితగతిన చర్యలు చేపట్టాలని ప్రధాని మోదీని కోరారు. తమిళ నాగరికత , తమిళ భాష వైభవాన్ని ప్రపంచానికి చాటే రీతిలో తమిళ ప్రజలకు చేయూత ఇవ్వాలని కోరినట్లు కమల్ పేర్కొన్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత .. తొలిసారి ప్రధాని మోదీని కమల్ కలిశారు. ఈ నేపథ్యంలో కీలడి థీమ్‌తో ఉన్న జ్ఞాపికను ప్రధాని మోదీకి బహూకరించారు. మధురై సమీపంలో ఉన్న వైగేయి నదీ పరివాహక ప్రాంతంలో కీలడి తొవ్వకాలు జరిగాయి. ప్రస్తుతం ఆ ప్రాంతం ఆర్కియాలజీ శాఖ ఆధీనంలో ఉన్నది. అక్కడ ప్రాచీన కాలంలోనే పట్టణ నాగరికత ఉన్నట్లు శాస్త్రవేత్తలు భావించారు. క్రీస్తూ పూర్వం మూడవ శతాబ్ధంలో తమిళ సాహిత్యం వెల్లివిరిసింది. సంఘం యుగంలో అది జరిగినట్లు భావిస్తున్నారు.
மாண்புமிகு இந்தியப் பிரதமர் திரு. நரேந்திர மோடி அவர்களை மரியாதை நிமித்தமாக இன்று சந்தித்தேன். ஒரு கலைஞனாகவும் தமிழ்நாட்டின் பிரதிநிதியாகவும் அவரிடம் சில கோரிக்கைகளைத் தெரிவித்திருக்கிறேன். அவற்றுள் தலையாயது கீழடி.
தமிழின் தொன்மையை, தமிழ் நாகரிகத்தின் பெருமையை உலகிற்கு உரக்கச்… pic.twitter.com/rXwXzddMvF
— Kamal Haasan (@ikamalhaasan) August 7, 2025