న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీ ఐకాన్‌గా మీమ్స్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన జపనీస్ శునకం కబొసు (17) శుక్రవారం మరణించింది. కబొసు వైరల్ మీమ్ చిత్రం 2013లో డాగీకాయిన్ (డొగ్) సృష్టికి స్ఫూర్తిగా నిలిచింది. 2010లో కబొసు ఫొటో మొదటిసారి నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.
2013 నాటికి కబొసు మీమ్స్‌కు ప్రజాదరణ పెరగడంతో డాగీకాయిన్ కబొసు చిత్రాన్ని తమ అధికారిక చిహ్నంగా మార్చింది. 2022లో కబొసు అనారోగ్యం బారిన పడినప్పుడు అభిమానులు వైద్య ఖర్చులు భరించేందుకు ముందుకొచ్చారు.