JPC | హిండెన్‌బర్గ్ ఆరోపణలపై జేపీసీ వేయాలి.. ప్రతిపక్షాల డిమాండ్
అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రిసెర్చ్ శనివారం విడుదల చేసిన డాక్యుమెంట్‌పై మరోసారి దేశంలో రాజకీయ దుమారం రేగింది.
- స్కామ్‌ను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలి
- సెబీ చైర్పర్సన్ మీద హిండెన్‌బర్గ్ ఆరోపణలపై ప్రతిపక్షాల డిమాండ్
- ఆరోపణలను ఖండించిన సెబీచీఫ్ మాధవి, అదానీ గ్రూప్
JPC | న్యూఢిల్లీ/ముంబై, ఆగస్టు 11: అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రిసెర్చ్ శనివారం విడుదల చేసిన డాక్యుమెంట్‌పై మరోసారి దేశంలో రాజకీయ దుమారం రేగింది. అదానీ గ్రూపు కంపెనీల్లో భారత స్టాక్ మార్కెట్ల నియంత్రణ మండలి సెబీ చైర్పర్సన్ మాధవి పురి బచ్‌కు, ఆమె భర్తకు రహస్య వాటాలు ఉన్నాయని చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. ‘సమ్‌థింగ్ బిగ్ సూన్ ఇండియా’ అంటూ ఎక్స్‌లో పేర్కొన్న గంటల వ్యవధిలోనే ఈ బాంబు పేల్చింది. ఈ నేపథ్యంలో సెబీ చైర్‌పర్సన్‌పై హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణల నిగ్గు తేల్చేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) విచారణ చేయించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఈ స్కామ్‌ను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలని ప్రతిపక్ష కాంగ్రెస్ కోరింది. అదానీ కుంభకోణంపై దర్యాప్తు సంస్థగా ఉన్న సెబీ చీఫ్‌పై కూడా ఆరోపణలు వస్తున్న క్రమంలో ఈ మొత్తం వ్యవహారాన్ని సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నది. తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో బచ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. సమగ్ర దర్యాప్తు జరిగే వరకు సెబీ చీఫ్‌గా మాధవి బచు తప్పుకోవాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి.
హిండెన్‌బర్గ్ వ్యక్తిత్వ హననం
హిండెన్‌బర్గ్ ఆరోపణలను సెబీ చీఫ్ మాధవి పురీ బచ్, ఆమె భర్త ధావల్ ఖండించారు. సెబీ విశ్వసనీయతను దెబ్బతీయడంతో పాటు దాని చైర్పర్సన్ వ్యక్తిత్వ హననానికి హిండెన్‌బర్గ్ సంస్థ ప్రయత్నిస్తున్నదన్నారు. ప్రైవేటు వ్యక్తులుగా తాము ఐఐఎఫ్ఎల్ వెల్త్ మేనేజ్మెంట్ ప్రమోట్ చేసిన ఫండ్‌లో పెట్టుబడులు పెట్టామని, మాధవి బచ్ సెబీలో పూర్తికాల సభ్యురాలిగా చేరడానికి రెండేండ్ల ముందు ఇది జరిగిందని తెలిపారు. భారత్‌లో పలు ఉల్లంఘనకు సంబంధించి ఇచ్చిన షోకాజ్ నోటీసులకు సమాధానం ఇవ్వని ఆ సంస్థ.. ఈ విధంగా ఎదురుదాడి చేస్తున్నదని ప్రకటనలో పేర్కొన్నారు.
సెబీ చీఫ్‌తో వాణిజ్య సంబంధాలు లేవు: అదానీ గ్రూపు
హిండెన్‌బర్గ్ తాజా ఆరోపణలను అదానీ గ్రూపు ఖండించింది. సెబీ చీఫ్ మాధవి పురీ బచ్‌తో తమ సంస్థకు ఎలాంటి వాణిజ్యపరమైన సంబంధాలు లేవని తెలిపింది. హిండెన్‌బర్గ్ కుట్రపూరితంగా ఆరోపణలు చేస్తున్నదని కొట్టిపారేసింది. వ్యక్తిగత లాభం కోసం వక్రీకరణలు చేస్తూ మదుపరులను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నదని తెలిపింది. మరోవైపు అదానీ గ్రూపుపై వచ్చిన ఆరోపణలపై తగిన విచారణ జరిగిందని, మాధవి పురీ బచ్ ఎప్పటికప్పుడు వివరాలను బహిర్గతం చేస్తూనే ఉన్నారని సెబీ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
Cult | విశ్వక్ సేన్ ‘కల్ట్’ ఫస్ట్ డే కలెక్షన్లు.. భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచిందా, బ్రేక్ ఈవెన్‌కు ఎంత రావాలంటే?
Conrad Star Hotel: బెంగుళూరు ఫైవ్ స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో కరెంట్ షాక్.. ఇద్దరు విదేశీయులు మృతి
Patancheru PS | పటాన్చెరు పీఎస్ నుంచి దొంగలు పరారు..!
Revenue Officer: రెవన్యూ అధికారి హత్య.. ముగ్గురు కుటుంబసభ్యులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

