కృష్ణ ఎల్లాకు జాన్స్ హాప్కిన్స్ అవార్డు
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ, కొవిడ్ వ్యాక్సిన్ కొవాగ్జిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ సహ వ్యవస్థాపకులు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లాకు అరుదైన గౌరవం దక్కింది.
న్యూఢిల్లీ, మే 24: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ, కొవిడ్ వ్యాక్సిన్ కొవాగ్జిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ సహ వ్యవస్థాపకులు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లాకు అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు జాన్స్ హాప్కిన్స్ బ్లూమ్‌బర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నుంచి ప్రతిష్ఠాత్మక పురష్కారం ‘డీన్స్ మెడల్’ వరించింది. ఈ మేరకు అవార్డును డీన్ ఎల్లెన్ జే మెకెంజీ కృష్ణ ఎల్లాకు అందజేశారు. అమెరికాలోని మేరీలాండ్ రాష్ట్రం బాల్టిమోర్ పట్టణంలో ఈ నెల 22న జరిగిన బ్లూమ్‌బర్గ్ స్కూల్ స్నాతకోత్సవంలో అవార్డును అందించారని భారత్ బయోటెక్ పేర్కొన్నది.
దేశానికి అంకితం: డాక్టర్ ఎల్లా
తనకు జాన్స్ హాప్కిన్స్ బ్లూమ్‌బర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అవార్డు అందజేయడంపై డాక్టర్ కృష్ణ ఎల్లా ఆనందం వ్యక్తం చేశారు. తనకు దక్కిన పురస్కారాన్ని సైన్స్ పురోగతిలో ఘన విజయం సాధించిన భారతదేశానికి అంకితం చేస్తున్నానని ప్రకటనలో పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

