న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల కోత కొనసాగుతూనే ఉన్నది. మే నెలలో 9,500 మంది తొలగింపునకు గురయ్యారని తాజా గణాంకాలు వెల్లడించాయి. మొత్తంగా ఈ ఏడాది ఇప్పటివరకు 89 వేల మందికిపైగా ఉద్యోగాలు కోల్పోయినట్లు తేలింది. ‘టెస్లా’ కంపెనీలో చార్జింగ్ టీమ్ అంతటినీ ఎలాన్ మస్క్ ఇంటికి పంపారు. ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ తోషిబా జపాన్‌లో 4వేలకుపైగా ఉద్యోగాల తొలగింపును చేపట్టింది. మైక్రోసాఫ్ట్ ‘ఎక్స్‌బాక్స్’ డివిజన్లో లేఆఫ్‌లు ప్రకటించింది. గేమింగ్ స్టూడియోలను మూసేస్తున్నది. టిక్‌టాక్ 1000 ఉద్యోగాలకు కోత పెట్టింది. గూగుల్, వాల్మార్ట్లలో లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. ఆర్థికమాంద్యంతో సిబ్బంది జీతభత్యాల భారాన్ని తగ్గించుకునేందుకు కంపెనీలు ఈ చర్యలు చేపడుతున్నాయి.