Deputy CM DK Shivakumar | డీకే శివకుమార్‌ను కలిసిన ఉద్యోగార్ధులు : ఖాళీ పోస్టుల భర్తీకి డిమాండ్
కర్నాటక పవర్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో నియామక ప్రక్రియను తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేస్తూ దాదాపు 1500 మంది ఉద్యోగార్ధులు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను (DK Shivakumar) ఆయన నివాసంలో కలిశారు.
బెంగళూర్ : కర్నాటకలో కాషాయ పార్టీని మట్టికరిపించి అధికారాన్ని హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల హామీల అమలుపై ఒత్తిడి పెరుగుతోంది. కర్నాటక పవర్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో నియామక ప్రక్రియను తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేస్తూ దాదాపు 1500 మంది ఉద్యోగార్ధులు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను (DK Shivakumar) ఆయన నివాసంలో కలిశారు.
ఉద్యోగ నియామకాలను వెంటనే ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలను నెరవేర్చే దిశగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని వారు పట్టుపట్టారు. ఈ సందర్భంగా డీకే శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ పోస్టులన్నింటినీ భర్తీ చేస్తామని తాము ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చడం తమ బాధ్యతని స్పష్టం చేశారు.
నిరుద్యోగ సమస్యను పరిష్కరించి అర్హులందరికీ ఉపాధి కల్పించడం తమ ప్రభుత్వ ప్రాధాన్యతాంశమని వివరించారు. ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియ కసరత్తును తాము చేపట్టామని, ఇది ఒకట్రెండు రోజుల్లో పూర్తవుతుందని తాను చెప్పలేనని, కానీ నియామకాల ప్రక్రియ జరిగి తీరుతుందని శివకుమార్ ఉద్యోగార్ధులకు భరోసా ఇచ్చారు.
Read More
wrestlers | పార్లమెంట్ భవనం ప్రారంభం రోజే ప్రజాస్వామ్యం ఖూనీ : మహిళా రెజ్లర్లు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

