న్యూఢిల్లీ: సెన్సస్ 2027 (జనాభా లెక్కల సేకరణ)లో అన్ని నివాస, నివాసేతర భవనాలను జియో ట్యాగ్ చేయాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
సెన్సస్‌కి చెందిన మొదటి దశలో ఇళ్ల జాబితాను(హౌస్‌లిస్టింగ్) తయారుచేసే సందర్భంగా తమకు కేటాయించిన హౌస్‌లిస్టింగ్ బ్లాకుల పరిధిలోని అన్ని భవనాలకు జియో ట్యాగ్ చేసేందుకు ఎన్యూమరేటర్లు డిజిటల్ లేఔట్ మ్యాపింగ్ (డీఎల్ఎం) ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. సెన్సస్‌లో భాగంగా భవనాలన్నిటికీ జియో ట్యాగింగ్ చేయడం ఇదే మొదటిసారి.