Jharkhand | శాసనసభా పక్ష నేతగా హేమంత్ సోరెన్.. 28న ప్రమాణం చేసే ఛాన్స్..!
Jharkhand | జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందిన సీఎం, జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆదివారం ఆయన గవర్నర్ సంతోష్ గంగ్వార్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన గవర్నర్‌కు రాజీనామాను సమర్పించారు.
Jharkhand | జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందిన సీఎం, జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆదివారం ఆయన గవర్నర్ సంతోష్ గంగ్వార్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన గవర్నర్‌కు రాజీనామాను సమర్పించారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఇండియా కూటమి ఎమ్మెల్యేల మద్దతు లేఖను సమర్పించారు. సోరెన్ వెంట కూటమి నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ 28న కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు. కూటమి తరఫున ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించామన్నారు. రాజీనామాను గవర్నర్‌కు సమర్పించానన్నారు.
గవర్నర్ తనకు తాత్కాలిక సీఎంగా బాధ్యతలు అప్పగించారన్నారు. అంతకు ముందు ఇండియా కూటమి నేతల సమావేశం జరిగింది. సమావేశంలో ఆయనను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు మద్దతు ప్రకటించారన్నారు. హేమంత్ సోరెన్‌ను జార్ఖండ్ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారని కాంగ్రెస్ నాయకుడు సుబోధ్‌కాంత్ సహాయ్ తెలిపారు. ఆయన 28న సీఎంగా ప్రమాణం చేసే అవకాశం ఉన్నది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో హేమంత్ సోరెన్ నేతృత్వంలోని కూటమి మూడింట రెండొంతుల మెజారిటీ సాధించింది. 81 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో కూటమి 56 స్థానాలు గెలిచింది. ప్రతిపక్ష బీజేపీకి కేవలం 24 సీట్లే దక్కాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

