జార్ఖండ్ సీఎం సొరేన్ కారు సీజ్
మనీలాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొంటున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌కు చెందిన బీఎండబ్ల్యూ కారుతోపాటు కొన్ని పత్రాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం జప్తు చేశారు.
- మనీలాండరింగ్ కేసులో ఈడీ చర్యలు
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొంటున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌కు చెందిన బీఎండబ్ల్యూ కారుతోపాటు కొన్ని పత్రాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం జప్తు చేశారు. ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లిన ఈడీ అధికారులకు ఆయన ఆచూకీ తెలియలేదు. దీంతో ఆయన నివాసంలో అధికారులు సోదాలు నిర్వహించారు. సొరేన్‌కు ఇప్పటికే ఈడీ ఏడుసార్లు సమన్లు జారీచేయగా.. ఆయన హాజరుకాలేదు. ఆయన ఈడీ సమన్లను సుప్రీంకోర్టులో మంగళవారం సవాల్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
అయితే ముఖ్యమంత్రి కార్యాలయం ఈడీ అధికారులకు పంపిన ఈ-మెయిల్లో, జనవరి 31న మధ్యాహ్నం 1 గంటకు సొరేన్‌ను రాంచీలోని ఆయన నివాసంలో ప్రశ్నించవచ్చునని తెలిపారు. ప్రభుత్వ భూముల యాజమాన్యం మార్పు కుంభకోణంలో రూ.600 కోట్లు చేతులు మారినట్లు ఈడీ ఆరోపిస్తున్నది. ఇదిలావుండగా, సొరేన్ కోసం ఈడీ అధికారులు సోమవారం జార్ఖండ్ భవన్‌కు, మోతీలాల్ నెహ్రూ మార్గ్‌లోని సొరేన్ తండ్రి నివాసానికి వెళ్లారు. కానీ ఆయన ఈ రెండు చోట్ల లేరు. ఆయన చార్టర్డ్ విమానం ఢిల్లీ విమానాశ్రయంలో పార్క్ చేసి ఉంది. కొందరు ఈడీ అధికారులు సోమవారం రాత్రి వరకు ఆయన నివాసం వెలుపల తిష్ఠ వేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

