న్యూఢిల్లీ: రాజ్యసభలో శుక్రవారం కాసేపు నవ్వులు పూశాయి. చైర్మన్ జగదీప్ ధన్కర్(Jagdeep Dhankhar), సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్.. ఆ నవ్వులకు కారణమయ్యారు. జయా బచ్చన్ మాట్లాడుతూ తన పేరును జయా అమితాబ్ బచ్చన్ అని పరిచయం చేసుకున్నారు. దీంతో చైర్లో ఉన్న జగదీప్ ఒక్కసారిగా గట్టిగా నవ్వారు. తన భర్త పేరుతో కలిపి పిలవ్వడాన్ని జయా బచ్చన్ ఇష్టపడలేదు. కొన్ని రోజుల ముందు జయా అమితాబ్ బచ్చన్ మాట్లాడాలంటూ.. డిప్యూటీ చైర్మెన్ హరివంశ్ నారాయన్ సింగ్ పిలిచారు. ఆ సమయంలో జయా బచ్చన్ కాస్త అసహనానికి లోనయ్యారు. కేవలం జయా బచ్చన్ అని పిలిస్తే సరిపోతుందన్నారు. ఆడవాళ్లు ప్రత్యేక గుర్తుంపు అంటూ లేదా అని ఆమె ప్రశ్నించారు. అయితే ఆ సంఘటన నేపథ్యంలో శుక్రవారం జయా బచ్చన్ నవ్వులాటగా తన భర్త పేరును జోడిస్తూ మాట్లాడారు.
జయా బచ్చన్ పూర్తి పేరు చెప్పడం, జగదీప్ ధనకర్ నవ్వడం జరిగిన సందర్భంలో ఎంపీలు జయరామ్ రమేశ్, రాఘవ చద్దాలు కూడా రియాక్ట్ అయ్యారు. మీరు లంచ్ బ్రేక్ తీసుకున్నారా, లేదా.. అందుకే జయరాం రమేశ్ పేరును పదేపదే ప్రస్తావిస్తున్నారని ధన్కర్ను ఉద్దేశిస్తూ జయా అన్నారు. ఆయన పేరు చెప్పకుండా మీకు తిన్నది అరగదేమో అని ఆమె అన్నారు. ఆ సమయంలో చాలా వినయంగా ధనకర్ రియాక్ట్ అయ్యారు. ఇవాళ లంచ్ బ్రేక్ తీసుకోలేదని, కానీ జయరాంతో లంచ్ చేశానని జగదీప్ అన్నారు.
మీకు, అమితాబ్‌కు అభిమానిని జగదీప్ ధన్కర్ ఈ సందర్భంగా తెలిపారు.
Don’t miss this video!
VP Dhankar handled Jaya Bachchan like a Pro 😂 pic.twitter.com/lcUMUhLnit
— BALA (@erbmjha) August 2, 2024