ముగ్గురు ఐఐటీ విద్యార్ధులకు బంపర్ ఆఫర్ : రూ .4 కోట్ల ప్యాకేజీ
గ్లోబల్ ప్రొప్రైటరీ ట్రేడింగ్ కంపెనీ జేన్ స్ట్రీట్ ముగ్గురు ఐఐటీ విద్యార్ధులకు రూ . 4 కోట్ల పైబడిన వార్షిక వేతన ప్యాకేజ్‌ను ఆఫర్ చేస్తూ సరికొత్త రికార్డు నెలకొల్పింది.
న్యూఢిల్లీ : గ్లోబల్ ప్రొప్రైటరీ ట్రేడింగ్ కంపెనీ జేన్ స్ట్రీట్ ముగ్గురు ఐఐటీ విద్యార్ధులకు రూ . 4 కోట్లకుపైగా వార్షిక వేతనాన్ని ఆఫర్ చేస్తూ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఐఐటీ ఢిల్లీ, బాంబే, కాన్పూర్ బ్రాంచ్‌లకు చెందిన ముగ్గురు విద్యార్ధులకు ఈ భారీ బొనాంజా దక్కింది. ఆర్ధిక మాంద్యం భయాలతో టెక్ కంపెనీలు హైరింగ్‌ను కుదించిన నేపధ్యంలో ఈ ఏడాది ప్లేస్మెంట్ సీజన్ ప్రారంభమైన మొదటి రోజునే జేన్ స్ట్రీట్ ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ ఐఐటీ విద్యార్ధులను వరించాయి.
జేన్ స్ట్రీట్ ఆఫర్స్ ఇప్పటివరకూ అత్యధిక ఆఫర్స్ అని ఐఐటీ కాన్పూర్, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే ప్లేస్మెంట్ అధికారులు వెల్లడించారు. గత ఏడాది ఐఐటీ విద్యార్ధుల ఫైనల్ ప్లేస్మెంట్లో ఊబర్ రూ 2.16 కోట్ల వేతన ప్యాకేజ్‌ను ఆఫర్ చేసింది. ఐఐటీ రూర్కీ విద్యార్ధి ఇంటర్నేషనల్ పొజిషన్ కోసం గరిష్టంగా రూ 1.6 కోట్ల ఆఫర్‌ను పొందారు.
ఇక ఇదే బ్రాంచ్ విద్యార్ధులు గురువారం ఆరు అంతర్జాతీయ పొజిషన్స్‌ను తమకు వచ్చిన ఆఫర్స్‌ను అంగీకరించారు. క్యాంపస్‌లో మొదటి రోజు తొలి సెషన్లో ఐఐటీ మద్రాస్ విద్యార్ధులు 445 ఆఫర్లకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఇది గత ఏడాది ప్లేస్మెంట్ ఆఫర్స్ కంటే పది శాతం అధికం కావడం గమనార్హం. వీటిలో 25 ఆఫర్లు రూ. కోటి వేతనం పైబడిన ఆఫర్లను విద్యార్ధులు ఆమోదించారు. ఆప్టివర్, డ విన్సి, కొహెసిటీ, రుబ్రిక్ వంటి కంపెనీలు మద్రాస్ క్యాంపస్‌లో 15 ఇంటర్నేషనల్ పొజిషన్స్‌ను విద్యార్ధులకు ఆఫర్ చేశాయని అధికారులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

