జమ్ము: జమ్ముకశ్మీరులోని రాంబన్ జిల్లాలో ఉగ్రవాద-మాదక ద్రవ్యాల ముఠా గుట్టును రట్టు చేసినట్లు జమ్ము జోన్ అదనపు డీజీపీ ముకేశ్ సింగ్ తెలిపారు. కశ్మీరు నుంచి జమ్ము వెళ్తున్న ఓ వాహనాన్ని సోదాలు చేశారని చెప్పారు.
ఈ వాహనంలో సుమారు 30 కేజీల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారని, దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ.300 కోట్లు ఉంటుందని తెలిపారు. ఈ కేసులో అరెస్టయిన ఇద్దరూ పంజాబ్‌కు చెందినవారని తెలిపారు.