Jammu Kashmir | ఒకరిపై ఒకరు కాల్పులు.. ఉదంపూర్‌లో ఇద్దరు పోలీసులు మృతి..!
Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లోని ఉదంపూర్‌లో ఇద్దరు పోలీసులను కాల్చివేశారు. ఈ ఘటనలో మరో పోలీస్ గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లోని ఉదంపూర్‌లో ఇద్దరు పోలీసులను కాల్చివేశారు. ఈ ఘటనలో మరో పోలీస్ గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆదివారం ఉదంపూర్ జిల్లా కేంద్రంలోని కాళీమాత ఆలయం వెలుపల పోలీస్ వ్యాన్‌లో బుల్లెట్ గాయాలతో మృతి చెందిన పోలీసుల మృతదేహాలు కనిపించాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.
ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకోవడంతోనే ఇద్దరు మరణించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఇద్దరి మధ్య కలహాలే కారణమని అనుమానిస్తున్నారు. రహమ్‌బాల్ ప్రాంతంలో వాగ్వాదం జరిగిందని.. ఆ తర్వాత ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకోవడం ఇద్దరు మృతి చెందారని.. మరొకరు గాయపడ్డారని ఎస్ఎస్పీ అమోద్ నాగ్పురే పేర్కొన్నారు. డిపార్ట్మెంట్ వాహనంలో సోపోర్‌లోని ఎస్టీసీ తల్వారాకు వెళ్తుండగా ఈ ఘటన జరిగిందన్నారు. ఈ ఘటన వెనుక నిజానిజాలను తెలుసుకునేందుకు విచారణ జరుపుతున్నట్లు వివరించారు. ప్రాథమిక విచారణలో AK-47 రైఫిల్ ఉపయోగించినట్లు తేలింది. గాయపడ్డ వ్యక్తి సురక్షితంగా ఉన్నారని.. పోస్టుమార్టం కోసం ఉదంపూర్ జీఎంసీకి తరలించినట్లు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

