జామియాలో 20 ఏండ్ల తర్వాత విద్యార్థి ఎన్నికలు
జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో 20 ఏండ్ల తర్వాత విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహిస్తామని మేనేజ్మెంట్ ప్రకటించింది. విద్యార్థి సంఘం ఎన్నికలు పునరుద్ధరించాలని అక్టోబర్ 12 నుంచి నిరసనలు జరుగుతున్నాయి.
న్యూఢిల్లీ : జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో 20 ఏండ్ల తర్వాత విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహిస్తామని మేనేజ్మెంట్ ప్రకటించింది. విద్యార్థి సంఘం ఎన్నికలు పునరుద్ధరించాలని అక్టోబర్ 12 నుంచి నిరసనలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఐదుగురు విద్యార్థులు 14 రోజులుగా నిరాహారదీక్ష చేస్తుండటంతో సోమవారం తెల్లవారు జామున 4.30 గంటలకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎండీ మెహతాబ్ ఆలం రిజ్వీ క్యాంపస్‌కు వెళ్లి నిరసనకారుతో చర్చలు జరిపారు.
విద్యార్థి సంఘం రాజ్యాంగానికి ఆమోదం లభించిన 15 రోజుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. షోకాజ్ నోటీసులు, సస్పెన్షన్ ఉత్తర్వులు వెనక్కు తీసుకుంటున్నట్టు హామీ ఇచ్చారు. కానీ విద్యార్థులు మాత్రం ఎన్నికల తేదీని ప్రకటించాలని పట్టుబట్టారు. స్పష్టమైన తేదీ చెప్పకుండా ఇలా హామీలు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. తమకు లిఖితపూర్వకమైన హామీలతో తేదీలను ప్రకటిస్తేనే నిరసనలకు ముగింపు పలుకుతామని తేల్చి చెబుతూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

