ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ కుమారుడు, ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు దర్యాప్తు నుంచి తనను తొలగించలేదని ఎన్సీబీ ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే తెలిపారు. ఈ కేసును కేంద్ర ఏజెన్సీ ద్వారా విచారణ జరుపాలని కోరుతూ కోర్టులో తాను పిటిషన్ వేసినట్లు ఆయన చెప్పారు. దీంతో ఆర్యన్, సమీర్ ఖాన్ కేసులను ఢిల్లీ ఎన్సీబీకి చెందిన సిట్ దర్యాప్తు చేస్తుందని అన్నారు.
కాగా, తమ జోన్లోని ఆర్యన్ ఖాన్ కేసుతో పాటు మరో ఐదు ఇతర కేసులతో సహా మొత్తం ఆరు కేసులను ఢిల్లీ ఎన్సీబీ బృందాలు దర్యాప్తు చేస్తాయని ఎన్సీబీ సౌత్ వెస్ట్రన్ రీజియన్ డిప్యూటీ డీజీ అశోక్ జైన్ తెలిపారు. ఇది పరిపాలనాపరమైన నిర్ణయమని ఆయన చెప్పారు.