గాంగ్టక్: ఐటీబీపీ జవాన్ ఓ 13 ఏండ్ల బాలికపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ అమ్మాయి గర్భందాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జవాన్‌ను అరెస్టు చేశారు. సిక్కింలోని పాక్యాంగ్ జిల్లా రంగ్పో టౌన్లో ఈ ఘటన చోటుచేసుకున్నది.
ఐటీబీపీలో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న నిందితుడు.. రాజ్‌భవన్‌లోని క్వార్టర్స్‌లో నివాసముంటున్నాడు. అతడు తన 13 ఏండ్ల కుమార్తెపై గత ఏప్రిల్ నుంచి లైంగిక దాడికి పాల్పడుతున్నాడని బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదుచేసింది. ప్రస్తుతం ఆమె గర్భవతి అని అందులో పేర్కొన్నది. ఎస్ఐతోపాటు అదేప్రాంతానికి చెందిన ఓ టీనేజర్ కూడా ఆ బాలికను లైంగికంగా హిస్తున్నాడని వెల్లడించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఐటీబీపీ ఎస్ఐని, టీనేజర్‌ను అరెస్టు చేశారు. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం దవాఖానకు తరలించామని పోలీసులు తెలిపారు. దర్యాప్తులో అసలు విషయాలు తెలుస్తాయని చెప్పారు.