సీఎంకు ఇచ్చిన వినతులు చెత్తకుప్పలో..
ముఖ్యమంత్రిని కలిసి కష్టాలు చెప్పుకుంటే తీరుతాయని భావించిన కర్ణాటక రైతులకు చేదు అనుభవం ఎదురైంది.
- సిద్ధరామయ్య తీరుపై విమర్శలు
బెంగళూరు, జూలై 13: ముఖ్యమంత్రిని కలిసి కష్టాలు చెప్పుకుంటే తీరుతాయని భావించిన కర్ణాటక రైతులకు చేదు అనుభవం ఎదురైంది. స్వయంగా సీఎంకు ఇచ్చిన వినతిపత్రాలు చెత్తకుప్పలో కనిపించాయి. ఈ ఘటన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విమర్శలకు కారణమైంది.
చామరాజనగరలో జూలై 10న సిద్ధరామయ్య ఓ బహిరంగ సభకు హాజరు కాగా, రైతులు, స్థానికులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆయనకు వినతిపత్రాలను సమర్పించారు. అయితే, ఈ వినతిపత్రాలు తాజాగా ఓ చెత్తకుప్పలో పడి ఉన్న వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో సిద్ధరామయ్య తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై సీఎం నైతిక బాధ్యత తీసుకొని, ప్రజలకు జవాబు చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర డిమాండ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
Ramayana | రూ.5000 కోట్ల వసూళ్లు సాధిస్తేనే సేఫ్.. భయపెడుతున్న ‘రామాయణ’ బ్రేక్ ఈవెన్ టార్గెట్!
Maruthi | ప్రభాస్‌కు మారుతి పుట్టినరోజు విషెస్.. ‘రాజాసాబ్’ ఎఫెక్ట్‌తో తెగ ట్రోలింగ్
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

