బెంగళూరు, ఆగస్టు 7: ‘ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్’ ఈవోఎస్-08 ప్రయోగాన్ని ఆగస్టు 15న చేపట్టబోతున్నట్టు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) బుధవారం వెల్లడించింది. శ్రీహరికోట నుంచి ఎస్ఎస్ఎల్వీ-డీ3 రాకెట్ ద్వారా ఈ శాటిలైట్‌ను భూ కక్ష్యలో ప్రవేశపెట్టనున్నట్టు తెలిపింది.
ఏడాది జీవితకాలం కలిగిన ‘ఈవోఎస్-08’ శాటిలైట్‌లోని పేలోడ్స్, భూమిపై శాటిలైట్ ఆధారిత నిఘాను చేపడతాయి. తద్వారా భూమిపై అగ్ని ప్రమాదాల్ని గుర్తించటం, పర్యావరణ విపత్తుల సమాచారం కీలకంగా మారనుంది.