నేడే నింగిలోకి ‘నాటీ బాయ్’!
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) శ్రీహరికోట నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్17 మిషన్ ద్వారా అత్యాధునిక భూపరిశీలన ఉపగ్రహం ఈవోఎస్-05ను ప్రయోగించేందుకు సిద్ధమైంది. శుక్రవారం తెల్లవారుజామున 2:55 గంటలకు ప్రయోగం చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన కౌంట్‌డౌన్ మొదలైంది. తొలి సంవత్సరాల్లో వరుస అనూహ్య ప్రదర్శనల కారణంగా ఈ రాకెట్ ఇస్రోలో ‘నాటీ బాయ్' అనే మారుపేరును సంపాదించుకున్నది.
- జీఎస్ఎల్వీ-ఎఫ్17 ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) శ్రీహరికోట నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్17 మిషన్ ద్వారా అత్యాధునిక భూపరిశీలన ఉపగ్రహం ఈవోఎస్-05ను ప్రయోగించేందుకు సిద్ధమైంది. శుక్రవారం తెల్లవారుజామున 2:55 గంటలకు ప్రయోగం చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన కౌంట్‌డౌన్ మొదలైంది. తొలి సంవత్సరాల్లో వరుస అనూహ్య ప్రదర్శనల కారణంగా ఈ రాకెట్ ఇస్రోలో ‘నాటీ బాయ్’ అనే మారుపేరును సంపాదించుకున్నది.
ఈ రాకెట్ అభివృద్ధి పదేపదే ఎదురుదెబ్బలతో సాగింది. దాని మొదటి 18 ప్రయోగాల్లో ఆరు లక్ష్యాన్ని సాధించడంలో విఫలమయ్యాయి. తాజాగా మరోసారి ప్రయోగం చేపట్టనున్నారు. భూమికి సుమారు 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న జియోసింక్రోనస్ కక్ష్య నుంచి ఈవోఎస్-05 ఉపగ్రహం పనిచేస్తుంది. అందువల్ల ఒక నిర్దిష్ట ప్రాంతాన్ని నిరంతరం పర్యవేక్షించే అవకాశం లభిస్తుంది. తక్కువ కక్ష్యల్లో ఉండే ఉపగ్రహాలు ఒక ప్రాంతం మీదుగా ఎప్పటికప్పుడు దాటిపోతుంటాయి. కానీ జియోసింక్రోనస్ ఉపగ్రహం ఒకే ప్రాంతంపై సుదీర్ఘకాలం పాటు దృష్టి పెట్టగలదు. జీశాట్-1ఏగా కూడా పిలిచే ఈవోఎస్-05 భారత ఉపఖండానికి సంబంధించిన చిత్రాలను తరచూ అందించేలా రూపొందించబడింది. ముఖ్యంగా భారత్ తన సరిహద్దులు, వ్యూహాత్మక ప్రాంతాలపై నిఘా ఉంచడానికి ఇది ఎంతో కీలకం కానున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

