బెంగళూరు: ఇస్రో సూర్యుడి గుట్టు విప్పేందుకు సిద్ధమవుతున్నది. సూర్యుడి రహస్యాలను తెలుసుకునేందుకు ఆదిత్య ఎల్1 ప్రయోగానికి ఏర్పాట్లు చేస్తున్నది. శాటిలైట్‌ను సెప్టెంబర్ మొదటివారంలో పీఎస్ఎల్వీ సీ57 వాహకనౌక ద్వారా నింగిలోకి పంపనున్నది. సూర్యుడి పుట్టుక, వాతావరణం గురించి లోతైన అధ్యయనం కోసం ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నారు.
ముఖ్యమైన పేలోడ్లు ఇవే..
1. విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్: కొరొనా, చిత్రాలు తీయడం, స్పెక్ట్రోస్కోపి, కొరోనల్ మాస్ ఎజెక్షన్పై దృష్టి సారిస్తుంది.
2. సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్: ఇది ఫొటోస్పియర్, క్రోమోస్పియర్పై పరిశోధనలు చేస్తుంది.
3. సోలార్ లో ఎనర్జీ ఎక్స్- రే స్పెక్ట్రోమీటర్: సూర్యుడిపై ఏర్పడే మృదువైన, కఠినమైన ఎక్స్-రే మంటలపై అధ్యయనం చేస్తుంది.
4. హై ఎనర్జీ ఎల్-1 ఆర్బిటింగ్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్: సూర్యుడిపై ఏర్పడే మృదువైన, కఠినమైన ఎక్స్-రే మంటలపై అధ్యయనం చేస్తుంది.
5. ప్లాస్మా ఎనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య: సౌర గాలిలో ఉండే ప్రొటాన్లు, ఎలక్ట్రాన్లు, అయాన్లపై పరిశోధనలు చేస్తుంది.
ఆదిత్య ఎల్-1 శాటిలైట్ సూర్యుడి భావ్య వలయంపై దృష్టి పెడుతుంది. ఈ ప్రయోగం ద్వారా కొరోనల్ హీటింగ్, కొరోనల్ మాస్ ఎజెక్షన్, ప్రి-ఫ్లేర్, ఫ్లేర్ యాక్టివిటీస్, వాటి లక్షణాలకు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని సేకరించనున్నట్టు శాస్త్రవేత్తలు చెప్పారు.