బెంగళూరు : సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒక ప్రైవేట్ సంస్థతో పంచుకునేందుకు ఇస్రో ముందడుగు వేసింది. శాటిలైట్ బస్ టెక్నాలజీ (వ్యోమనౌకలో ప్రధాన భాగాల తయారీ)ని వాణిజ్యపరంగా విస్తరించి దేశ అంతరిక్ష పరిశోధన రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏడీటీఎల్)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇస్రో వాణిజ్య విభాగం ఎన్ఎస్ఐఎల్ చైర్మన్, ఎండీ డీ రాధాకృష్ణ, అల్ఫా చైర్మన్ హెచ్ఎస్ శంకర్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. వాణిజ్యపరంగా శాటిలైట్స్‌ను ఉత్పత్తి చేయటంలో ముందడుగుగా ఇస్రో పేర్కొన్నది.