Israel Advisory | ఢిల్లీలోని ఎంబసీ వద్ద పేలుడు.. పౌరులకు అడ్వైజరీని జారీ చేసిన ఇజ్రాయెల్..!
Israel Advisory | దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో మంగళవారం సాయంత్రం పేలుడు సంభవించింది. చాణక్యపురిలోని ఎంబసీ వద్ద 5.48 గంటలకు పేలుడు జరిగిందని ఎంబసీ ప్రతినిధి గై నిర్ తెలిపారు.
Israel Advisory | దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో మంగళవారం సాయంత్రం పేలుడు సంభవించింది. చాణక్యపురిలోని ఎంబసీ వద్ద 5.48 గంటలకు పేలుడు జరిగిందని ఎంబసీ ప్రతినిధి గై నిర్ తెలిపారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మండలి భారత్‌లోని తమ పౌరులకు అడ్వైజరీని జారీ చేసింది. ఎంబసీ వద్ద పేలుడును ఉగ్రవాద దాడిగా ఇజ్రాయెల్ అభివర్ణించింది.
జ్యూయిస్ పౌరులు మాల్స్, మార్కెట్లు తదితర రద్దీ ప్రదేశాలకు వెళ్లొద్దని సూచించింది. రెస్టారెంట్లు, హోటళ్లు, పబ్బులు, బహిరంగ ప్రదేశాలతో పాటు అన్నిచోట్లా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. గుంపులుగా ఎక్కడికీ వెళ్లవద్దని.. ఎక్కడికి వెళ్లినా తమ ఐడెంటినీ సాధారణ వ్యక్తులకు చెప్పొద్దని సూచించింది. సోషల్ మీడియాలో ఫొటోలను పోస్ట్ చేయొద్దని చెప్పింది. ఇదిలా ఉండగా.. మంగళవారం సాయంత్రం రాయబార కార్యాలయం వెనుకాల పేలుడు జరిగినట్లు పోలీసులకు సమాచారం అందిందని ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ఇజ్రాయెల్ ఎంబసీ సెక్యూరిటీ గార్డు సమాచారం అందించాడని, వంద మీటర్ల దూరంలో ఉన్న సమయంలో పేలుడు శబ్దం వినిపించిందని పేర్కొన్నారు.
ఆ తర్వాత ఢిల్లీ పోలీసులు, స్పెషల్ పార్టీ, ఫైర్ సర్వీసెస్, సెంట్రల్ సెక్యూరిటీ ఏజెన్సీల అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. సంఘటనా స్థలం మంటలు, పేలుడు జరిగినట్లుగా ఎలాంటి క్లూలు లేవని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఘటనా స్థలంలో బాంబు డిటెక్షన్ డాగ్ స్క్వాడ్, బాంబు డిస్పోజల్ స్క్వాడ్లను మోహరించారు. అయితే, 2021 జనవరిలో ఎంబసీ వద్ద స్వల్ప తీవ్రతతో బాంబు దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ పేలుడుపై ఎన్ఐఏ ఇంకా విచారణ జరుపుతున్నాయి. ఇటీవల మళ్లీ ఎంబసీకి బాంబు బెదిరింపులు వచ్చాయి. హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలతో ఎంబసీ వద్ద భద్రతను పెంచారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

