Night Curfew | నైట్ కర్ఫ్యూ వెనక ఎలాంటి సైన్స్ లేదా? క్లారిటీ ఇచ్చిన డబ్ల్యూహెచ్‌వో
Night Curfew | నైట్ కర్ఫ్యూ.. కరోనా మొదలైనప్పటి నుంచి ప్రజల, ప్రభుత్వాల నోళ్లలో బాగా నానుతున్న పదం. రోజంతా ప్రజలు తిరగడానికి అనుమతినిచ్చి

Night Curfew | నైట్ కర్ఫ్యూ.. కరోనా మొదలైనప్పటి నుంచి ప్రజల, ప్రభుత్వాల నోళ్లలో బాగా నానుతున్న పదం. రోజంతా ప్రజలు తిరగడానికి అనుమతినిచ్చి, కేవలం రాత్రుల్లోనే కర్ఫ్యూను ఎందుకు విధిస్తారు? ఉదయమే కదా.. ప్రజలందరూ తిరిగేది.. మరి రాత్రి ఎందుకు కర్ఫ్యూ? ఈ ప్రశ్న దాదాపు అందరికీ ఉదయించిందే. అయితే దీని వెనుక ఎలాంటి సైన్సూ లేదట. ఈ విషయాన్ని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ స్పష్టం చేశారు.
‘నైట్ కర్ఫ్యూ లాంటి విషయంలో ఎలాంటి సైన్సూ లేదు. దీని వెనుక శాస్త్రమే లేదు. కోవిడ్‌ను అరికట్టాలంటే భారత దేశం లాంటి దేశాలు సైన్స్ ఆధారితమైన విధానాలను రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.’ అని సౌమ్య స్వామినాథన్ సూచించారు. ప్రస్తుతం ఇండియాలో వెలుగు చూస్తున్న కేసులు చాలా తక్కువని, ఇది ఆరంభమేనని, మున్ముందు మరింత ప్రభావం చూపే ఛాన్స్ ఉందని ఆమె హెచ్చరించారు. ప్రజలు గుమిగూడి ఉండే ప్రదేశాలు, వినోదభరితమైన ప్రదేశాల్లోనే ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందే ఛాన్స్ ఉందని, ఈ ప్రాంతాలపైనే ప్రభుత్వాలు ఎక్కువ దృష్టి నిలపాలని సౌమ్య స్వామినాథన్ సూచించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

