నిరసన, ఉగ్రవాదం ఒక్కటేనా ?

- అసమ్మతిని అణగదొక్కే ఆరాటంలో కేంద్రానికి ఈ తేడా కనిపించలేదు
- కాలేజీ విద్యార్థుల నిరసనలతో దేశ పునాదులు కదలవు
- కేంద్రంపై ఢిల్లీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
- ఢిల్లీ అల్లర్ల కేసులో ముగ్గురు విద్యార్థులకు బెయిల్
న్యూఢిల్లీ: రాజ్యాంగం కల్పించిన ‘నిరసన తెలిపే హక్కుకు’, ఉగ్రవాద చర్యకు మధ్య తేడా ఉన్నదని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనల సందర్భంగా ఢిల్లీలో చోటుచేసుకున్న అల్లర్లకు సంబంధించిన కేసులో గతేడాది అరస్టైన ముగ్గురు విద్యార్థులు నటాషా నర్వాల్, దేవాంగన కలితా (జేఎన్‌యూ), అసిఫ్ ఇక్బాల్ తన్హా (జామియా మిలియా ఇస్లామియా) లకు కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. తీర్పు సందర్భంగా కోర్టు స్పందిస్తూ.. ‘అసమ్మతిని అణచివేయాలనే ఆరాటంలో కేంద్రానికి.. రాజ్యాంగం హామీ ఇచ్చిన నిరసన తెలిపే హక్కుకూ, ఉగ్రవాద చర్యకు మధ్య ఉన్న తేడా మసకబారినట్టు అనిపిస్తున్నది. ఇది ప్రజాస్వామ్యానికి దుర్దినం. సాధారణంగా ఐపీసీ కిందకు వచ్చే నేరాలకు ఉగ్రవాద చర్య పేరుతో యూఏపీఏ చట్టాన్ని వర్తింపజేయరాదు. అతిశయోక్తి ప్రసంగాలు మినహా నిందితులపై మోపిన అభియోగాలు ఏవీ యూఏపీఏ కిందకు రావు’ అని కోర్టు అభిప్రాయపడింది. మన దేశ పునాదులు బలంగా ఉన్నాయని, కేవలం కాలేజీ విద్యార్థుల నిరసనలతో అవేమీ చెదరవని వ్యాఖ్యానించింది.
ఆ చట్టంలోనే స్పష్టత లేదు
యూఏపీఏ చట్టంలోనే ‘ఉగ్రవాద చర్య’ను అస్పష్టంగా నిర్వచించారని కోర్టు అభిప్రాయపడింది. ఐపీసీ కింద వచ్చే నేరాలకూ ఈ చట్టాన్ని సాధారణరీతిలో అమలుచేయడం తగదని హితవు పలికింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

