Viral Video | ట్రాఫిక్ పాయింట్ వద్ద కీచైన్లు అమ్ముకునే బాలుడికి నెటిజన్ల భరోసా
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కీచైన్లు అమ్ముకునే బాలుడి యోగక్షేమాల పట్ల సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తి కనబరిచారు. ఈ వీడియోను (Viral Video) ఇన్‌స్టాగ్రాంలో సాక్షి అనే అకౌంట్ జూన్ 7న పోస్ట్ చేయగా ఇప్పటివరకూ ఏకంగా 74 లక్షల మంది వీక్షించారు.
అహ్మదాబాద్ : ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కీచైన్లు అమ్ముకునే బాలుడి యోగక్షేమాల పట్ల సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తి కనబరిచారు. ఈ వీడియోను (Viral Video) ఇన్‌స్టాగ్రాంలో సాక్షి అనే అకౌంట్ జూన్ 7న పోస్ట్ చేయగా ఇప్పటివరకూ ఏకంగా 74 లక్షల మంది వీక్షించారు. ఈ వీడియోలో గుజరాత్‌లోని ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద బాలుడు కీచైన్లు అమ్ముతూ కనిపించాడు.
సిగ్నల్ వద్ద ఆగిన ఓ వ్యక్తి ఈ వీడియోను రికార్డు చేశారు. ఈ వీడియోలో బాలుడి కుడి కాలికి గాయం కావడం చూడొచ్చు. గాయానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కాలిని క్లాత్, ప్లాస్టిక్‌తో కవర్ చేయడం కనిపిస్తుంది. ఈ వీడియోతో పలువురు బాలుడి గాయంపై ఆందోళన చెందారు. ఈ బాలుడికి తక్షణమే వైద్య సాయం అందించాలని గాయాన్ని అలా వదిలేస్తే గ్యాంగ్రిన్గా మారుతుందని కలత చెందారు.
బాలుడి అడ్రస్, కాంటాక్ట్ నెంబర్ అందిస్తే తాము ఆపన్న హస్తం అందిస్తామని పలువురు నెటిజన్లు ముందుకొచ్చారు. ఈ వీడియో తన గుండెను కలిచివేసిందని, ప్రేమ, ఆప్యాయతలను పొందాల్సిన వయసులో ఈ బాలుడు నొప్పితోనే తన పనులు చేసుకోవడం కరుడుగట్టిన జీవిత సత్యమని ఓ యూజర్ రాసుకొచ్చారు.
Read More :
viral video | మరణించిన భాగస్వామిని వీడేందుకు నిరాకరించిన పక్షి..ఆపై ఏమైందంటే..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Narayanpet | నారాయణపేటలో కొట్టుకున్న బీఎస్పీ- కాంగ్రెస్ నాయకులు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

