న్యూఢిల్లీ: బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిపై ప్రపంచ దేశాల దృష్టి పడింది. క్షిపణులను తమకు సరఫరా చేయాలని ఆరు దేశాలు అభ్యర్థిస్తున్నాయని బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రకటించింది. రష్యాతో సంయుక్త భాగస్వామ్యంతో నిర్మించిన వీటి తయారీ ఇంకా పూర్తిగా చేపట్టకముందే ఈ ఆర్డర్లు వచ్చినట్టు కంపెనీ సీజీఎం ప్రవీణ్ పథక్ తెలిపారు. గత ఏడాదే ఫిలిప్పీన్ రక్షణ శాఖ తమతో ఈ మేరకు 375 మిలియన్ డాలర్లకు ఒప్పందం కుదుర్చుకుందన్నారు.