హైదరాబాద్ : తెలంగాణ మోడల్ స్కూల్స్ సొసైటీలో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 194 మోడల్ స్కూల్లో నాలుగు కోర్సుల్లో ఫస్టియర్లో ప్రవేశాలకు శనివారం నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఈ నెల 10వ తేదీలోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఆ సొసైటీ డైరెక్టర్ ఉషారాణి తెలిపారు. పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన ఉంటుందని, ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ కోర్సుల్లో 31 వేలపైచీలుకు సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. వివరాలకు www.tsmodelschools.com వెబ్సైట్ చూడాలని సూచించారు.
కోర్సు సీట్లు
ఎంపీసీ 7,760
బైపీసీ 7,760
ఎంఈసీ 7,760
సీఈసీ 7,760
మొత్తం సీట్లు 31,040