నాగ్పూర్ : నాగ్పూర్ నుంచి లక్నో బయలుదేరిన ఇండిగో విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లో నాగ్పూర్ విమానాశ్రయానికి తిరిగి వచ్చింది. ఇందుకు సాంకేతిక లోపం కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని ఎయిర్లైన్స్ తెలిపింది. సాంకేతిక లోపం గుర్తించిన తర్వాత పైలట్లు ప్రామాణిక ఆపరేటింగ్ విధానాల మేరకు విమానాన్ని తిరిగి సురక్షితంగా విమానాశ్రయానికి తీసుకువచ్చారని అధికారులు పేర్కొన్నారు. విమానం నుంచి పొగలు రావడంతో ఇండిగో విమానాన్ని నాగ్పూర్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేయడంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విచారణకు ఆదేశించిందని డీజీసీఏ అధికారి తెలిపారు.