రాయ్పూర్ : ఇండిగో విమానం మంగళవారం మధ్యాహ్నం రాయ్పూర్ విమానాశ్రయంలో దిగిన తర్వాత దాని తలుపులు తెరుచుకోలేదు. దీంతో ప్రయాణికులు సుమారు 30 నిమిషాలపాటు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
దీనిలో చిక్కుకున్న వారిలో ఛత్తీస్గఢ్ మాజీ సీఎం, కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్, ఎమ్మెల్యే చతురి నంద్, రాయ్పూర్ మేయర్ మీనాల్ చౌబే కూడా ఉన్నారు. ఢిల్లీ నుంచి బయల్దేరిన 6ఈ 6312 విమానం రాయ్పూర్ విమానాశ్రయంలో మధ్యాహ్నం దిగింది. బఘేల్ మాట్లాడుతూ, గేటు తెరుచుకోవడంలో సాంకేతిక సమస్య వచ్చిందని అన్నారు.