న్యూఢిల్లీ, నవంబర్ 29: విద్యుత్తు ప్రవాహంలో అసాధారణ పెరుగుదల కారణంగా షార్ట్-సర్క్యూట్ సమస్య తలెత్తి పవర్ గ్రిడ్లు పాడవ్వడం తరచూ జరుగుతూనే ఉంటుంది. దీనికి స్వదేశీ సాంకేతికతతో చెక్ పెట్టే స్మార్ట్ సిస్టమ్ ప్రోటోటైప్‌ను ఐఐటీ-కాన్పూర్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ‘స్మార్ట్ సూపర్‌కండక్టింగ్ ఫాల్ట్ కరెంట్ లిమిటర్’ అని పిలిచే ఈ సాంకేతికతతో నిర్ణీత స్థాయిని దాటి ప్రవహిస్తున్న విద్యుత్తును నిరోధించవచ్చని ఆవిష్కర్తల్లో ఒకరైన సత్యజిత్ బెనర్జీ తెలిపారు. సూపర్ కండక్టర్ల సాయంతో విద్యుత్తు ప్రవాహాన్ని నియంత్రిస్తామని
వెల్లడించారు.