Indian Student | లండన్లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి.. హత్యా లేక ఆత్మహత్యా.. తేల్చాలంటున్న కుటుంబం
Indian Student : లండన్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు వెళ్లిన తెలంగాణ విద్యార్థి అనుమానాస్పదంగా మరణించాడు. తన గదిలో జూన్ 23న ఉదయం అతడి మృతదేహాన్ని స్నేహితులు గుర్తించారు. అయితే, అతడి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Indian Student : లండన్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు వెళ్లిన తెలంగాణ విద్యార్థి అనుమానాస్పదంగా మరణించాడు. తన గదిలో జూన్ 23న ఉదయం అతడి మృతదేహాన్ని స్నేహితులు గుర్తించారు. అయితే, అతడి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడి పేరు శ్రీనాథ్ రెడ్డి. కామారెడ్డి జిల్లా, రాజంపేట మండలం, తలమడ్ల గ్రామంలోని మధుసూధన్ రెడ్డి తనయుడు. 14 నెలల క్రితం ఎంఎస్ చదివేందుకు శ్రీనాథ్ రెడ్డి లండన్ వెళ్లాడు. అక్కడ స్నేహితులతో ఉంటున్నాడు.
ఈ నెల 22న రాత్రి చివరిసారిగా కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. అదే రోజు రాత్రి మరణించాడు. జూన్ 23న ఉదయం అతడి మరణించి ఉన్నట్లు స్నేహితులు తెలిపారు. శ్రీనాథ్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని అతడి రూమ్మేట్స్ అంటున్నారు. ఈ విషయంపై శ్రీనాథ్ రెడ్డి బంధువులకు, స్నేహితులకు సమాచారం ఇచ్చారు. వారు ఇండియాలోని కుటుంబ సభ్యులకు విషయం తెలిపారు. అయితే, శ్రీనాథ్ రెడ్డి మరణంపై అతడి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతడు ముందు రోజు రాత్రే తమకు ఫోన్ చేసి మాట్లాడాడని, ఎప్పట్లాగే చాలా మామూలుగా మాట్లాడాడని అంటున్నారు. ఆ రోజు రాత్రి తన స్నేహితుల బర్త్ డే పార్టీకి హాజరయ్యాడని చెప్పారు. ఆ మరుసటి రోజే అతడు మరణించినట్లు తమకు కబురందిందన్నారు. ముందురోజు రాత్రి చాలా మామూలుగా మాట్లాడిన వ్యక్తి ఎలా ఆత్మహత్యకు పాల్పడుతారని వారు ప్రశ్నిస్తున్నారు.
అందువల్ల శ్రీనాథ్ రెడ్డిది హత్యా.. ఆత్మహత్యా అన్నది తేల్చాలని కోరుతున్నారు. ఈ విషయంలో తమకు తెలంగాణ ప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా సాయం చేయాలని విన్నవించారు. శ్రీనాథ్ మరణంపై ఉన్న అనుమానాలు నిగ్గుతేల్చాలని కోరుతున్నారు. తమ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, శ్రీనాథ్ మృతదేహాన్ని ఇండియా తెచ్చేందుకు సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
Balmuri Venkat | భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి.. ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

