న్యూఢిల్లీ : భారతీయ రైళ్లలో నిత్యం పెద్ద సంఖ్యలో జనం ప్రయాణిస్తున్నారు. సౌకర్యవంతంగా ఉండడంతో పాటు ఆహారం సైతం అందుబాటులో ఉంటుంది. సాధారణ బెర్తులతో ఏసీ సౌకర్యం ఉన్నది. ముఖ్యంగా చౌక ప్రయాణం, భద్రతతో ఉండడంతో జనం దూర వెళ్లేందుకు రైలు ప్రయాణంపై ఆసక్తి చూపుతుంటారు. అలాగే టికెట్లను సైతం సులభంగా బుక్ చేసేందుకు అవకాశం ఉన్నది. అయితే, ప్రస్తుతం రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది.
ఇటీవల టికెట్లను బుక్ చేసేందుకు తప్పనిసరిగా ప్రయాణికుడు తన చిరునామాను ఇవ్వడం తప్పనిసరి చేసింది. చిరునామా పేర్కొనకపోతే టికెట్లు బుక్ అయ్యే అవకాశం లేదు. దీంతో చాలా మంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తాజాగా ఈ నిబంధనను రైల్వేశాఖ ఎత్తివేసింది. ఇకపై చిరునామా ఇవ్వకుండాను టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఇచ్చింది. కరోనా సమయంలో రైల్వేశాఖ ఈ నిబంధన అమలులోకి తీసుకువచ్చింది.
కొవిడ్ పాజిటివ్ కేసులను గుర్తించడంలో చిరునామా సహాయపడింది. కొవిడ్ సమయంలో రైల్వేశాఖ నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో రైల్వే బోర్డు, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖతో చర్చించిన అనంతరం ఈ నిబంధనను నిలిపివేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రైల్వేశాఖ ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రస్తుతం ఐఆర్సీటీసీ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేస్తున్నది.