న్యూఢిల్లీ: భారతీయ యుద్ధ నౌక ఐఎన్ఎస్ సహ్యాద్రి(INS Sahyadri).. దక్షిణ చైనా సముద్రంలో మోహరిస్తున్నారు. గడిచిన రెండు వారాల్లో.. ఆ వివాదాస్పద జలాల్లో భారతీయ యుద్ధ నౌక సంచరించడం ఇది రెండో సారి. ప్రస్తుతం ఐఎన్ఎస్ సహ్యాద్రి మూడు రోజుల పాటు మలేషియాలో ఉన్నట్లు నేవీ ఓ ప్రకటనలో తెలిపింది. దక్షిణ చైనా సముద్రంలో ఈస్ట్రన్ ఫ్లీట్ ను డిప్లాయ్ చేస్తున్నారని, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో కూడా యుద్ధ నౌకల మోహరింపును బలపేతం చేస్తున్నట్లు నేవీ పేర్కొన్నది. ఐఎన్ఎస్ సహ్యద్రి బాధ్యతాయుతంగా ఆపరేషనల్ డిప్లాయ్మెంట్లో పాల్గొన్నదని, ఇండో-పసిఫిక్ సముద్ర ప్రాంతంలో సెక్యూర్టీ భాగస్వామి బాధ్యతలను నిర్వర్తిస్తున్నట్లు నేవీ పేర్కొన్నది.
రెండు వారాల క్రితమే మరోయుద్ధ నౌక ఐఎన్ఎస్ నిస్తార్ ఇండో పసిఫిక్ రీచ్‌లో పాల్గొన్నది. పది రోజుల పాటు ఆ ఈవెంట్ జరిగింది. సింగపూర్ వేదికగా జరిగిన పసిఫిక్ రీచ్ విన్యాసాల్లో అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ దేశ నౌకలు కూడా పాల్గొన్నాయి. దక్షిణ చైనా సముద్ర జలాలపై చైనా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నది. అయితే మలేషియాతో పాటు మరో అయిదు దేశాలు ఆ జలాలపై చైనాతో గొడవపడుతున్నాయి. ద్వైపాక్షిక ప్రయోజనాల దృష్ట్యా.. ప్రాంతీయ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయనున్నట్లు నేవీ పేర్కొన్నది.
గైడెడ్ మిస్సైల్ స్టీల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ సహ్యాద్రి గతంలో రెండు సార్లు మలేషియాకు వెళ్లింది. గుడ్‌విల్ మిషన్‌లో భాగంగా 2016లో పోర్ట్ క్లాంగ్కు వెళ్లింది. 2019లో సముద్ర లక్ష్మణ విన్యాసాల్లో పాల్గొనేందుకు కోట కినబాలు డాక్‌యార్డుకు వెళ్లినట్లు తెలుస్తోంది.