నాసిక్, అక్టోబర్ 4: భారతీయ సంగీత సాధనాలైన పిల్లన గ్రోవి, తబలా, హార్మోనియం లాంటి వాటిని మాత్రమే వాహనాలకు హారన్‌లా అమర్చేలా చట్టం తీసుకురావడానికి తాను ప్రయత్నం చేస్తున్నట్టు కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. పోలీసు, అంబులెన్స్ వాహనాల సైరన్ శబ్ధాన్ని కూడా మార్చాలని భావిస్తున్నట్టు తెలిపారు. నాసిక్‌లో హైవే ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘మంత్రులు రోడ్లపై వెళ్తున్నప్పుడు పోలీసు వాహనాలు పెద్ద ఎత్తున సైరన్ శబ్ధం చేస్తూ వెళ్తాయి. ఇది చాలా చిరాకు కలిగిస్తుంది. చెవులకు కూడా మంచిది కాదు. అందుకే ఆకాశవాణిలో ఉదయం పూట వచ్చే సంగీతాన్ని సైరన్ శబ్ధంగా మార్చాలని అనుకొంటున్నాను. ఇది మనసుకు ఆహ్లాదాన్నిస్తుంది’ అని చెప్పారు.