కాఠ్మాండ్, మే 28: పర్వతారోహణలో భారత్‌కు చెందిన సత్యదీప్ గుప్తా చరిత్ర సృష్టించారు. మౌంట్ ఎవరెస్ట్, మౌంట్ లోట్సేను ఒక సీజన్లో రెండుసార్లు అధిరోహించడమే కాక, ఎవరెస్ట్ నుంచి లోట్సేకు 11 గంటల 15 నిముషాల్లో చేరుకుని మరో రికార్డు సృష్టించారు. 8,516 మీటర్ల ఎత్తున్న మౌంట్ లోట్సేను సత్యదీప్ సోమవారం మధ్యాహ్నం, 8,849 మీటర్ల ఎత్తున్న మౌంట్ ఎవరెస్ట్‌ను రాత్రి 12.45 గంటలకు ఎక్కారు.
భారత పర్వతారోహకుడు మృతి భారత్‌కు చెందిన 46 ఏండ్ల బన్సీలాల్ అనే మౌంట్ ఎవరెస్ట్ పర్వతారోహకుడు మృతి చెందారు. కొండల్లో చిక్కుకుపోయిన అతడిని హెలికాప్టర్‌తో రక్షించారు. అతడు చికిత్స పొందుతూ కాఠ్మాండూలో మరణించించాడు.