Operation Sindoor | న్యూఢిల్లీ : పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా.. భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్ ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ మెరుపుదాడుల్లో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలకు చెందిన స్థావరాలను నేలమట్టం చేసి, ఉగ్రవాదులను మట్టుబెట్టింది. మే 7వ తేదీన పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసిన నిమిషాల వ్యవధిలోనే భారత సైన్యం తమ సోషల్ మీడియా హ్యాండిల్లో సిందూరం లోగోతో కూడిన ఆపరేషన్ సిందూర్ అనే పోస్టర్‌ను పెట్టారు. 25 నిమిషాల పాటు మెరుపులు దాడులు జరగ్గా, ఆ తర్వాత అర్ధరాత్రి 1.51 గంటలకు ఆపరేషన్ సిందూర్ అనే పోస్టర్‌ను పోస్టు చేసింది ఇండియన్ ఆర్మీ. అయితే మన సైనికుల శౌర్యానికి నిదర్శనమైన ఈ ఆపరేషన్‌కు అంకితమిస్తూ ఇండియర్ ఆర్మీ పత్రికి బాత్‌చిట్(మాటామంతీ) తాజా సంచిక వెలువడింది. లెఫ్టినెంట్ కర్నల్ హర్ష్‌గుప్తా, హవల్దార్ సురీందర్ సింగ్ ఆపరేషన్ సిందూర్ లోగోను రూపొందించినట్లు ఆ పత్రిలో పేర్కొన్నారు.