18,600 అడుగుల ఎత్తులో డేరింగ్ ఆపరేషన్
లద్దాఖ్‌లోని నన్ కున్ పర్వత శ్రేణి సమీపంలో భారత సైనికులు చేపట్టిన అత్యంత సాహసోపేతమైన ‘హై-ఆల్టిట్యూడ్' రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైంది. సుమారు 18,600 అడుగుల ఎత్తులో నిటారుగా ఉన్న కొండవాలు నుంచి ఓ రోగిని సైనిక సిబ్బంది సురక్షితంగా తరలించారు. అత్యంత క్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల్లో నిర్వహించిన ఈ ఆపరేషన్‌కు సంబంధించిన ఫొటోలను, వీడియోను భారత సైన్యానికి చెందిన ఫైర్ అండ్ ఫ్యూరీ కోర్ సోషల్‌మీడియా వేదికగా పంచుకుంది.
- రోగిని కాపాడిన ఆర్మీ
న్యూఢిల్లీ, ఆగస్టు 30: లద్దాఖ్‌లోని నన్ కున్ పర్వత శ్రేణి సమీపంలో భారత సైనికులు చేపట్టిన అత్యంత సాహసోపేతమైన ‘హై-ఆల్టిట్యూడ్’ రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైంది. సుమారు 18,600 అడుగుల ఎత్తులో నిటారుగా ఉన్న కొండవాలు నుంచి ఓ రోగిని సైనిక సిబ్బంది సురక్షితంగా తరలించారు. అత్యంత క్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల్లో నిర్వహించిన ఈ ఆపరేషన్‌కు సంబంధించిన ఫొటోలను, వీడియోను భారత సైన్యానికి చెందిన ఫైర్ అండ్ ఫ్యూరీ కోర్ సోషల్‌మీడియా వేదికగా పంచుకుంది.
ఈ రెస్క్యూ మిషన్‌కు అనేక సవాళ్లు ఎదురయ్యాయి. ఆ ప్రాంతంలో గాలులు తీవ్రంగా వీయడంతోపాటు, సముద్రమట్టానికి చాలా ఎత్తులో ఉండటం వల్ల గాలి సాంద్రత తక్కువ. దీంతో హెలికాప్టర్ ఇంజిన్ పనితీరు, రోటర్ లిఫ్ట్, బరువును మోసే సామర్థ్యం తగ్గే పరిస్థితి ఏర్పడింది. రోగి ఉన్న ప్రదేశంలో హెలికాప్టర్‌ను పూర్తిగా ల్యాండ్ చేయడానికి సరైన స్థలం లేదు. ఈ పరిస్థితిని ముందుగానే అంచనావేసి, హెలికాప్టర్ బరువును తగ్గించే చర్యలు చేపట్టింది. రోగి వద్దకు చేరుకున్న తర్వాత పూర్తిస్థాయిలో ల్యాండింగ్ అవసరం లేకుండానే గ్రౌండ్ టీమ్ రోగిని హెలికాప్టర్లోకి తరలించింది. తాజా రెస్క్యూ ఆపరేషన్ భారత సైనికుల అసాధారణ నైపుణ్యం, ధైర్యసాహసాలను మరోసారి ప్రపంచానికి చాటింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

