Army Pilot: బ్యాక్‌గ్రౌండ్‌లో హెలికాప్టర్.. గ్రాడ్యుయేషన్ సెర్మనీలో ప్రేయసికి పైలట్ ప్రపోజల్.. వీడియో
Army Pilot : శిక్షణ పూర్తి కాగానే తన గర్ల్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేశాడు ఓ పైలట్. ఈ ఘటన నాసిక్‌లోని ట్రైనింగ్ స్కూల్లో జరిగింది. హెలికాప్టర్ బ్యాక్‌గ్రౌండ్‌లో.. తన లవర్‌ను థ్రిల్ చేశాడు కెప్టెన్ భరత్ భరద్వాజ్. ఈ వీడియో వైరల్ అవుతోంది.
నాసిక్: ఓ పైలట్ తన ప్రేయసికి వెరైటీగా ప్రపోజ్(Army Pilot) చేశాడు. పాసింగ్ ఔట్ పరేడ్ తర్వాత.. పైలట్‌గా శిక్షణ పొందిన హెలికాప్టర్ ముందే తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఈ ఘటన నాసిక్‌లోని కంబాట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్లో జరిగింది. గ్రాడ్యుయేషన్ సెర్మనీలో జరిగిన ఈ ఘటనకు చెందిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇండియన్ ఆర్మీ ఏవియేషన్ కెప్టెణ్ భరత్ భరద్వాజ్.. తన కుటుంబసభ్యులు, బంధుమిత్రుల ముందే ప్రేయసి ఆరుషిని ఆశ్చర్యపరిచాడు. మోకాళ్ల మీద కూర్చుని ఆమెకు ప్రపోజ్ చేశాడు. అయితే బ్యాక్‌గ్రౌండ్‌లో హెలికాప్టర్ ఉండడం గమనార్హం. జూన్ 2వ తేదీన ఈ ఘటన జరిగంది. తన కెరీర్లో వ్యక్తిగత మైలురాయి అందుకున్న కెప్టెన్ భరద్వాజ్ ఆ సంతోషాన్ని క్షణాలను మరింత పదిలం చేసుకున్నాడు. ప్రియురాలు ఆరుషి ముందు మోకాళ్లపై కూర్చుని ఎంగేజ్మెంట్ రింగ్‌ను తొడిగాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న కుటుంబసభ్యులు, తోటి ఆఫీసర్లు, ఇన్స్ట్రక్టర్లు, అతిథులు ఆ జంటకు కంగ్రాట్స్ చెప్పారు.
“Grand Proposal Steals the Show: Newly Commissioned Indian Army Pilot Proposes to Girlfriend Right After Passing-Out Parade in Nashik”#Nashik, #Maharashtra – In a heartwarming and emotional moment that stole the show, newly commissioned Indian Army pilot Bharat Bhardwaj… pic.twitter.com/uYsq8W22cJ
— Siraj Noorani (@sirajnoorani) June 2, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

