Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’ను ఇండియన్ ఆర్మీ లాంఛనంగా ప్రారంభించింది. సైనికుల రేషన్ నాణ్యతను మెరుగుపరచడం దీని లక్ష్యమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
న్యూఢిల్లీ: రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’ను ఇండియన్ ఆర్మీ లాంఛనంగా ప్రారంభించింది. సైనికుల రేషన్ నాణ్యతను మెరుగుపరచడం దీని లక్ష్యమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. (Indian Army launches Bharat Rice) సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సమక్షంలో ‘భారత్ రైస్’ సేకరణ, పంపిణీ కోసం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ)తో ఆర్మీ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది. ‘ఈ అత్యుత్తమ నాణ్యత గల బియ్యాన్ని, స్థానిక ఎఫ్‌సీఐ కేంద్రాల నుంచి ఆర్మీ డిపోలు సేకరించడానికి బదులుగా లడఖ్, ఈశాన్య ప్రాంతాలతో సహా అన్ని ఆర్మీ సరఫరా డిపోలకు నేరుగా పంపిణీ జరుగుతుంది’ అని అధికార ప్రకటనలో పేర్కొన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో రక్షణ శాఖ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా బియ్యాన్ని మిల్లింగ్ చేసి, నాఫెడ్ ద్వారా సరఫరా చేస్తారని వెల్లడించారు.
కాగా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ కార్యక్రమంలో మాట్లాడారు. సైనికుల కార్యాచరణ సంసిద్ధత కేవలం ఆయుధాలతోనే నిర్వచించలేమని తెలిపారు. అత్యంత కఠినమైన పరిస్థితులలో పనిచేస్తున్నప్పుడు వారి శారీరక, మానసిక ఆరోగ్యం, మనోధైర్యం, ఓర్పుపై కూడా ఆధారపడి ఉంటుందని చెప్పారు. అందుకే సైనికుల సంక్షేమం ఒక అప్రధానమైన విషయం కాదని, జాతీయ భద్రతలో అది అంతర్భాగమని అన్నారు. ఆరోగ్యకరమైన ఆహారం, పటిష్టమైన పరికరాలు, సంపూర్ణ శిక్షణ సైనికుల మనోధైర్యాన్ని పెంచుతుందని, ప్రతి సవాలును వారు ఎదుర్కొనేందుకు సిద్ధం చేస్తాయని ఆయన వివరించారు.
అయితే కేంద్ర ప్రభుత్వం రెండు సంవత్సరాల కిందటే ‘భారత్’ బ్రాండ్ ఉత్పత్తులను ప్రారంభించింది. ఇప్పటికే సాధారణ ప్రజల కోసం ప్యాక్ చేసిన సబ్సిడీ బియ్యాన్ని ‘భారత్ రైస్’ పేరుతో అమ్మడం ప్రారంభించింది. అలాగే ‘భారత్ ఆటా’ ‘భారత్ దాల్’ బ్రాండ్లను కూడా విక్రయిస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

