800 కోట్లకు ప్రపంచ జనాభా
నవంబర్ 15, 2022 (మంగళవారం)నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకోనున్నట్టు ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ‘వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్-2022’ నివేదికను ఇటీవల యూఎన్ విడుదల చేసింది. ఆ నివేదికలో జనాభా పెరుగుదల, ఏయే ప్రాంతాల్లో అత్యధికం, ఈ పెరుగుదల రానున్న రోజుల్లో ఎలా ఉంటుందోనన్న అంశాలు ఉన్నాయి
- వచ్చే ఏడాది నాటికి అత్యధిక
- జనాభా గల దేశంగా భారత్
నవంబర్ 15, 2022 (మంగళవారం)నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకోనున్నట్టు ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ‘వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్-2022’ నివేదికను ఇటీవల యూఎన్ విడుదల చేసింది. ఆ నివేదికలో జనాభా పెరుగుదల, ఏయే ప్రాంతాల్లో అత్యధికం, ఈ పెరుగుదల రానున్న రోజుల్లో ఎలా ఉంటుందోనన్న అంశాలు ఉన్నాయి.
నివేదికలోని కీలకాంశాలు..15 నవంబర్
- 2022 నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లు. ప్రస్తుతం జనాభా అత్యధికంగా పెరుగుతున్న దేశాల్లో భారత్ తొలిస్థానంలో ఉన్నది.
- 2023లో జనాభా పరంగా చైనాను అధిగమించనున్న భారత్. తద్వారా ప్రపంచంలోనే అత్యధిక జనాభా
గల దేశంగా అవతరించే అవకాశం. - 2030 నాటికి ప్రపంచ జనాభా 850 కోట్లు. ఈ జనాభా 2050 నాటికి 970 కోట్లకు చేరుకుంటుందని అంచనా.
అయితే ఈ అంచనాలో సగానికిపైగా పెరుగుదల కేవలం 8 దేశాల్లోనే నమోదవుతుంది. ఆ ఎనిమిది దేశాలు భారత్, పాకిస్థాన్, కాంగో, ఈజిప్టు, ఇథియోపియా, నైజీరియా, ఫిలిప్పీన్స్, టాంజానియా. - ప్రపంచ జనాభా 600 కోట్ల నుంచి 700 కోట్లకి చేరుకోవడానికి దాదాపు 12 ఏండ్లు పట్టింది. 700 కోట్ల నుంచి 800 కోట్లకి చేరుకోవడానికి కూడా దాదాపుగా అంతే సమయం పడుతున్నది.
- 2080 నాటికి ప్రపంచ జనాభా 1,000 కోట్లకు చేరుకొని, 2100 వరకు ఆ స్థాయిలోనే ఉంటుంది.
- అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పని చేసే జనాభా (25 ఏండ్ల నుంచి 64 ఏండ్ల వయసు ఉన్నవాళ్లు) క్రమంగా పెరుగుతున్నది.
- ప్రస్తుతం ప్రపంచ సగటు ఆయుఃప్రమాణం 72.8 ఏండ్లు. 1990 నుంచి చూసుకుంటే ఆయుర్దాయం 9 ఏండ్లు పెరిగింది.
- 700 కోట్ల నుంచి 800 కోట్లకి చేరుకోవడంలో సగానికిపైగా (60 కోట్ల మంది) జనాభా ఆసియా దేశాల నుంచే ఉన్నది. మిగిలిన 40 కోట్ల జనాభా ఆఫ్రికా దేశాల నుంచే ఉన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- china
- country
- India
- Population
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
Balmuri Venkat | భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి.. ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

